ప్రతి విజయానికి మూలం శ్రమ – ప్రతి అభివృద్ధికి బలం కార్మికులు

హైదరాబాద్ :  శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపునిచ్చే ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ (May Day) సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కార్మిక లోకానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టం చేసిన ప్రతి చేతి విలువను గుర్తించి, సమానత్వం, న్యాయం, గౌరవం కోసం కలిసి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.“ప్రతి కార్మికుడి చెమట చుక్కలో మన సమాజ భవిష్యత్తు దాగి ఉంది. కార్మికుల అంకితభావం, కష్టపడే మనస్తత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికుల హక్కులను కాపాడటంలో...