ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeక్రైమ్పోలీస్ స్టేషన్‌లోనే కార్డు స్వైప్ చేసి రూ.8.14 లక్షలు వసూలు..!?

పోలీస్ స్టేషన్‌లోనే కార్డు స్వైప్ చేసి రూ.8.14 లక్షలు వసూలు..!?

  • ఏసీపీ, ఎస్సైలపై సంచలన ఆరోపణలు చేస్తూ ఎల్బీనగర్ డీసీపీ కి ఫిర్యాదు చేసిన బాధితులు*
  • రక్షకులే భక్షకులు అయ్యారంటూ బాధితుల ఆరోపణలు
  • సెటిల్మెంట్లకు అడ్డాలుగా చైతన్యపురి పోలీస్ స్టేషన్ అంటూ ఆరోపణలు..?
  • ఒక ఏసీపీ స్థాయి ఉన్నత అధికారి డబ్బుల వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించడమా…!?*
  •  ఆశ్వి అప్డేట్స్ తెలంగాణ క్రైమ్ బ్యూరో జూన్ 09: ప్రశ్నించినందుకు బాధితున్ని ఏసీపీ ఆఫీస్ కి తీసుకువచ్చి బల్లలు గుద్దుతు ఒక ఏసీపీ అధికారి దుర్భషాలాడుతూ కొడుకుని లోపల తోయి లేదంటే డబ్బులు వాసులు చేయండి అంటూ సదరు కిందిస్తాయి అధికారి చైతన్యపురి ఎస్ ఐ వెంకటయ్య కు హుకుం జారిచేసిన ఎల్బినగర్ ఏసీపీ కృష్ణయ్య*….

మల్కాజ్‌గిరి: పోలీస్ స్టేషన్‌లో క్రెడిట్ కార్డు స్వైపింగ్ మిషన్ పెట్టి డబ్బులు వసూలు చేశారంటూ క్వెస్ట్ బిజినెస్ టెక్ భాగస్వాములు సంచలన ఫిర్యాదు చేశారు. ఏసీపీ, ఎస్సైలు బెదిరించి రూ.8.14 లక్షలు వసూలు చేసి, మిగతా రూ.7 లక్షలకు చెక్కులు తీసుకున్నారని ఆరోపించారు. ఈ మేరకు *మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్*కు వినతి పత్రం సమర్పించారు.

 

ఫిర్యాదుదారులు: పల్లం నరేందర్, దారపురెడ్డి నాగేందర్ – FIR No. 623/2026లో A3, A4

 

సంఘటన వివరాలు: జూలై 2025లో నరేందర్, నాగేందర్, సరస్వతి హరీష్ రాజ్ కలిసి ఉప్పల్ X రోడ్డు వద్ద ఇండియన్ బ్యాంక్ పైన క్వెస్ట్ బిజినెస్ టెక్ కంపెనీ ప్రారంభించారు. సెప్టెంబర్ 2025లో హరీష్ రాజ్ పరిచయంతో నల్లి సుజాత అనే మహిళ నుంచి చెక్ రిపబ్లిక్ వీసా ప్రాసెసింగ్ కోసం *రూ.6.30 లక్షలు* కంపెనీ కరెంట్ అకౌంట్‌లోకి తీసుకుని హరీష్ రాజ్ చెప్పిన యూరప్ వ్యక్తికి చెల్లించారు. వీసా ప్రాసెస్ జరగకపోవడంతో డిసెంబర్ 2025లో సుజాతకు డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పారు.

హరీష్ రాజ్ మోసం: హరీష్ రాజ్ సుజాతతో కలిసి డిసెంబర్ 2025 నుంచి వ్యక్తిగతంగా వ్యాపారం చేస్తూ, సుజాత నుంచి *రూ.39 లక్షలు* తన వ్యక్తిగత అకౌంట్‌లో వేయించుకున్నాడని, కంపెనీ లెటర్ హెడ్‌పై ఒప్పందాలు ఇచ్చాడని తెలిపారు. మార్చి 2026లో హరీష్ రాజ్ భాగస్వామ్యం నుంచి నిష్క్రమించాడు.

 

స్టేషన్‌లో బెదిరింపులు: మే 2, 2026న సుజాత 20 మంది అనుచరులతో ఆఫీస్‌కు వచ్చి దాడి చేసింది. జూన్ 5, 2026న చైతన్యపురి పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి FIR 623/2026 నమోదు చేసినట్లు చెప్పారు. ఎస్సై వెంకటయ్య అసభ్య పదజాలంతో తిట్టి, ఏసీపీ కృష్ణయ్య వద్దకు తీసుకెళ్లారని వాపోయారు.

ఏసీపీ ఆఫీస్‌లో ఒత్తిడి: ఏసీపీ కృష్ణయ్య వద్ద సుజాత, ఆమె అనుచరులు ఉండగా, వెంటనే *రూ.15 లక్షలు* చెల్లించాలని, లేకుంటే జైలుకు పంపి ప్రెస్‌మీట్ పెట్టి ఆఫీస్ సీజ్ చేస్తానని బెదిరించారని ఆరోపించారు. రూ.8 లక్షలు అదే రోజు, మిగతా రూ.7 లక్షలు 15 రోజుల్లో చెల్లించాలని హుకుం జారీ చేశారన్నారు.

 

పోలీస్ స్టేషన్‌లో స్వైపింగ్: తిరిగి చైతన్యపురి స్టేషన్‌కు తీసుకొచ్చిన ఎస్సై వెంకటయ్య మొబైళ్లు స్వాధీనం చేసుకుని లాకప్ వద్ద కూర్చోబెట్టారని తెలిపారు. సుజాత తన ఆఫీస్ నుంచి కార్డు స్వైపింగ్ మిషన్ తెచ్చి ఎస్సై టేబుల్‌పై ఉంచి క్రెడిట్ కార్డులు స్వైప్ చేయించిందని వాపోయారు. డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గది ముందు ఒక కార్డు, పార్కింగ్‌లో మిగతా కార్డులు స్వైప్ చేయించి మొత్తం *రూ.8,14,500* డ్రా చేశారని ఆరోపించారు. రూ.100 స్టాంప్ పేపర్‌పై ఒప్పందం, ప్రామిసరీ నోట్ రాయించి, 20/06/2026 తేదీతో *రూ.7 లక్షల* చెక్కులు తీసుకున్నారన్నారు. 41 CrPC నోటీసులు ఇచ్చి కాపీలు కూడా ఇవ్వలేదన్నారు.

 

ఫిర్యాదుదారుల నేపథ్యం: నాగేందర్ 1999 కార్గిల్ యుద్ధం ‘ఆపరేషన్ విజయ్’, 2001 పార్లమెంట్ దాడి ‘ఆపరేషన్ పరాక్రమ్’లో పాల్గొన్న ఎయిర్ ఫోర్స్ మాజీ సైనికుడని, నరేందర్ NRI అని తెలిపారు. తమను మోసం చేసిన భాగస్వామి హరీష్ రాజ్‌పై చర్యలు తీసుకోకుండా, ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

డిమాండ్: ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, అమాయకులకు న్యాయం చేయాలని ఎల్బీనగర్ డిసీపీని కోరారు. మాకు న్యాయం జరగక పోతే మల్కాజిగిరి సీపీ కి, తెలంగాణ డీజీపీ కి కూడా ఫిర్యాదు చేస్తామని బాధితులు తెలిపారు…

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!