ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్తూప్రాన్ మండలంలో 'లవ్ జిహాద్' కలకలం

తూప్రాన్ మండలంలో ‘లవ్ జిహాద్’ కలకలం

పేరు మార్చి పెళ్లి.. నమ్మించి మోసం..

-తూప్రాన్ మండలంలో ‘లవ్ జిహాద్’ కలకలం

-మూడో పెళ్లి వెలుగులోకి

-నిందితుడు యూట్యూబ్ రిపోర్టర్..?

తూప్రాన్, ఆగస్టు 4

( ఆశ్వి అప్డేట్స్ )

తనను తాను అనాథగా, హిందూ యువకుడిగా పరిచయం చేసుకుని.. ఓ అమాయక యువతిని నమ్మించి పెళ్లి చేసుకున్న ముస్లిం యువకుడి దగాకోరుకోణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలు పేరు దాచి, ఆధార్ వివరాలను సైతం మరుగున పరిచి ఆరు సంవత్సరాలుగా నాటకమాడుతున్న సదరు నిందితుడి బండారాన్ని గ్రామస్తులు రట్టు చేసి పోలీసులకు అప్పగించిన ఘటన తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లిలో తీవ్ర కలకలం రేపింది.

పరిచయం నుంచి పరిణయం వరకు

ఆరు సంవత్సరాల క్రితం గుండ్రెడ్డిపల్లికి చెందిన మన్నె సుజాత దంపతులు అనారోగ్య కారణాలతో కౌకూరు దర్గాకు వెళ్తుండేవారు. ఆ సమయంలో అక్కడ నాజర్ అలియాస్ హేమంత్ అనే వ్యక్తి వారికి పరిచయమయ్యాడు. తనకు ఎవరూ లేరని, అనాథనని నమ్మబలికి ఆ కుటుంబానికి దగ్గరయ్యాడు. ఆ నమ్మకంతోనే అతను గుండ్రెడ్డిపల్లికి వచ్చి, ఆ కుటుంబంతో పాటే గ్రామంలో నివాసముండసాగాడు.కుటుంబ సభ్యుడిలా మెలుగుతూనే, సుజాత రెండో కుమార్తెను తన మాయమాటలతో బురిడీ కొట్టించాడు. అతని మాటలను నిజమేనని నమ్మిన పెద్దలు, ఈ ఏడాది మే నెలలో తూప్రాన్‌లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో ఘనంగా వివాహం జరిపించారు.

ఫోన్ చూసి భార్య దిగ్బ్రాంతి..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

పెళ్లయిన కొద్దిరోజులకే అతని ప్రవర్తనపై భార్యకు అనుమానం మొదలైంది. పని పేరుతో తరచూ మియాపూర్ వెళ్తుండటంతో అతని కదలికలపై నిఘా పెట్టింది. ఈ క్రమంలో అతని ఫోన్‌ను పరిశీలించిన భార్యకు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. పలువురు మహిళలతో అసభ్యంగా గడిపిన దృశ్యాలు, వీడియోలు ఫోన్లలో లభ్యమయ్యాయి. పలువురు అమాయక అమ్మాయిలు, మహిళల ఫోటోలను ఫోన్లో దాచిపెట్టి, వాటి ఆధారంగా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభించాయి.ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో నిందితుడు కొన్ని రోజుల క్రితం గ్రామం వదిలి పారిపోయాడు. కాగా, అతను మళ్లీ గ్రామానికి చేరుకోవడంతో, బాధితురాలు గ్రామస్తులకు విషయం తెరిచి చెప్పింది. ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

ఆధార్‌తో అసలు రూపం బట్టబయలు.. ఇప్పటికే ఇద్దరితో పెళ్లి

గ్రామస్తుల విచారణలో నిందితుడు దిమ్మతిరిగే నిజాలు ఒప్పుకున్నాడు.

తాను హిందూ యువకుడిని కానని, ముస్లిం వర్గానికి చెందిన నాజర్ అని అంగీకరించాడు.ఆధార్ కార్డు వివరాల ప్రకారం అతను అనాథ కాదు. కీసరలో తన తల్లితో కలిసి నివాసముంటున్నట్లు తెలిపాడు.ఇతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడని, అతను గుంటూరులో స్థిరపడినట్లు సమాచారం.గ్రామస్తులు దేహశుద్ధి చేస్తున్న సమయంలో తనకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయని సంచలన నిజాన్ని ఒప్పుకున్నాడు.అంతేకాకుండా, తాను సోషల్ మీడియాలో ఒక యూట్యూబ్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తున్నానని గ్రామంలోని సమస్యలను బయట పెట్టడానికే వచ్చానని వెల్లడించాడు.

లవ్ జిహాద్ కోణంపై తీవ్ర అనుమానాలు

అమాయకపు హిందూ అమ్మాయిలనే టార్గెట్ చేసుకుని, పేరు మార్చుకుని, మాయమాటలతో లోబరుచుకోవడం.. ఆపై రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసి వేధించడమే ఇతని ప్రధాన ఉద్దేశమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అతని ఫోన్ నిండా హిందూ మహిళల ఫోటోలే ఉండటంతో ఇది పక్కా ప్రణాళిక ప్రకారం చేసిన ‘లవ్ జిహాద్’ కుట్రేనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ రిపోర్టర్ ముసుగులో ఈ ముఠా వెనక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే సందేహాలు కూడా గ్రామస్తుల నుండి వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల విచారణ ముమ్మరం

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు తూప్రాన్ ఎస్ఐ గంగరాజు తెలిపారు. నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని, దానిలోని డేటాను విశ్లేషిస్తున్నామని పేర్కొన్నారు. నిందితుడి పూర్వాపరాలపై, అలాగే ఈ కుట్ర వెనుక ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందా అనే కోణంలో తూప్రాన్ పోలీసులు ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!