ePaper
Friday, September 4, 2026
ePaper
Homeతెలంగాణకేటీఆర్‌ను కలిసిన బాల్క సుమన్.. బెయిల్ తర్వాత తొలి భేటీ

కేటీఆర్‌ను కలిసిన బాల్క సుమన్.. బెయిల్ తర్వాత తొలి భేటీ

కేటీఆర్‌ను కలిసిన బాల్క సుమన్.. బెయిల్‌పై విడుదల అనంతరం మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నమోదైన కేసులో బెయిల్‌పై చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన నేరుగా కేటీఆర్‌ను కలిసి మాట్లాడారు.

సింగరేణికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బాల్క సుమన్‌పై కేసు నమోదైంది. అనంతరం ఆయనను పోలీసులు అరెస్ట్ చేసి న్యాయస్థానం ఆదేశాలతో జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఇటీవల హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.

విడుదల అనంతరం కేటీఆర్‌ను కలిసిన బాల్క సుమన్ తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ కార్యక్రమాలపై చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కూడా హాజరైనట్లు తెలుస్తోంది.

బాల్క సుమన్‌పై నమోదైన కేసు రాజకీయ కక్షసాధింపులో భాగమేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తుండగా, చట్టపరంగా తమ పోరాటం కొనసాగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!