ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeతెలంగాణయాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు చోటు

యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు చోటు

యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు.. చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు చోటు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో కూడిన ఈ బోర్డులో ప్రముఖ నటుడు చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు కూడా స్థానం కల్పించింది. ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేసింది.

కొత్తగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ బోర్డు ఆలయ పరిపాలన, అభివృద్ధి పనులు, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ధార్మిక కార్యక్రమాల నిర్వహణ వంటి అంశాలను పర్యవేక్షించనుంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ బోర్డులో సభ్యులుగా నియమితులయ్యారు.

యాదాద్రిని దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!