ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeతెలంగాణఐదు రోజులుగా స్తంభించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. సర్వర్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు

ఐదు రోజులుగా స్తంభించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. సర్వర్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు

ఐదు రోజులుగా స్తంభించిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు.. సర్వర్ సమస్యతో ప్రజలకు ఇబ్బందులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ గత ఐదు రోజులుగా తీవ్ర అంతరాయానికి గురైంది. సర్వర్ సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ శాఖ వెబ్‌సైట్ పనిచేయకపోవడంతో ఇప్పటికే స్లాట్లు బుక్ చేసుకున్న ప్రజలు, రియల్ ఎస్టేట్ వర్గాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.

ప్రభుత్వం ముందుగా జూన్ 26 నుంచి 28 వరకు సర్వర్ అప్‌గ్రేడ్, నిర్వహణ పనుల కోసం రిజిస్ట్రేషన్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే నిర్ణయించిన గడువు ముగిసిన తర్వాత కూడా సర్వర్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో సోమవారం, మంగళవారం కూడా రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం కాలేదని సమాచారం.

దీంతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చిన ప్రజలు పనులు పూర్తి కాక నిరాశగా వెనుదిరుగుతున్నారు. తరచూ సర్వర్ సమస్యలు తలెత్తుతున్నప్పటికీ శాశ్వత పరిష్కారం లభించడం లేదని డాక్యుమెంట్ రైటర్లు, రియల్ ఎస్టేట్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మందగించిన రియల్ ఎస్టేట్ రంగంపై ఈ అంతరాయం మరింత ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు.

ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి రిజిస్ట్రేషన్ సేవలను సాధారణ స్థితికి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. సర్వర్ పూర్తిగా పునరుద్ధరించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపినప్పటికీ, సేవలు ఎప్పుడు పూర్తిస్థాయిలో పునఃప్రారంభమవుతాయనే అంశంపై అధికారిక స్పష్టత కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!