ePaper
Monday, August 31, 2026
ePaper
Homeతెలంగాణఅక్బర్ పేట బ్రాహ్మణ కుంట కబ్జా చేశారంటూ..! డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం

అక్బర్ పేట బ్రాహ్మణ కుంట కబ్జా చేశారంటూ..! డిప్యూటీ తహశీల్దార్ కి వినతిపత్రం

– అక్బర్ పేట భూంపల్లి డిప్యూటీ తహశీల్దార్ కి ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
– భూకబ్జా దారుల నుండి బ్రాహ్మన కుంటని కాపాడాలని గ్రామస్థల ఆవేదన
– అక్బర్ పేట గ్రామ సర్పంచ్ మండల కుమార్

అక్బర్ పేట/భూంపల్లి జూన్ 27 ఆశ్వి అప్డేట్స్

బ్రాహ్మణ కుంటను కబ్జా చేశారంటూ..గ్రామస్థులు ఆందోళ చెందిన ఘటన అక్బరుపేట భూంపల్లి మండలం అక్బరుపేట గ్రామంలో చోటుచేసుకుంది. అక్బర్ పేట గ్రామస్తులంతా కలిసి స్థానిక మండల తహసిల్దార్ కార్యాలయంలో బ్రాహ్మణ కుంట కాపాడాలంటూ,మండల డిప్యూటీ తహశీల్దార్ వేణుగోపాలరావు, గిర్ధవర్ సుమతి లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అక్బర్ పేట సర్పంచ్ మండల కుమార్ మాట్లాడుతూ, బ్రాహ్మణ కుంట అనేది కొంతమంది భూకబ్జాదారులు కబ్జా చేశారంటూ ఆరోపించారు. బ్రాహ్మణ కుంట తోపాటు బ్రాహ్మణ కుంట కి వెళ్ళే దారిని కూడా ఆక్రమించారని అన్నారు. భూ కబ్జాదారుల నుండి బ్రాహ్మణ కుంట ను కాపాడి గ్రామస్తులకు న్యాయం చేయాలని కోరారు. గ్రామస్తులు అందరితో కలిసి తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజయ్,వార్డు మెంబర్లు శ్రీరామ్,గ్రామస్థులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!