ePaper
Wednesday, July 1, 2026
ePaper
Homeసినీమాస్కూల్ రోజుల్లో వేధింపులు ఎదుర్కొన్నా.. చివరకు రాయి విసిరా: నటి కయాదు లోహర్

స్కూల్ రోజుల్లో వేధింపులు ఎదుర్కొన్నా.. చివరకు రాయి విసిరా: నటి కయాదు లోహర్

స్కూల్ రోజుల్లో వేధింపులు ఎదుర్కొన్నా.. చివరకు రాయి విసిరా: నటి కయాదు లోహర్

హైదరాబాద్: యువ నటి కయాదు లోహర్ తన పాఠశాల రోజులలో ఎదుర్కొన్న వేధింపుల గురించి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పదో తరగతి చదువుతున్న సమయంలో కొందరు యువకులు ప్రతిరోజూ వేధించేవారని, ఒక దశలో సహనం కోల్పోయి వారిపై రాయి విసిరిన ఘటన ఇప్పటికీ గుర్తుందని ఆమె తెలిపారు.

కయాదు లోహర్ మాట్లాడుతూ, ఇంటి సమీపంలోని ట్యూషన్‌కు వెళ్లే సమయంలో కొందరు యువకులు తరచూ వేధించేవారని చెప్పారు. మొదటి రెండు రోజులు వాటిని పట్టించుకోకుండా వెళ్లిపోయినా, మూడో రోజు తీవ్ర ఆవేశానికి గురై రోడ్డుపై ఉన్న రాయిని తీసుకుని వారి వైపు విసిరినట్లు వెల్లడించారు. ఆ రాయి ఒక యువకుడికి తగలడంతో గాయమైనట్లు ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆ సంఘటనను ఇప్పుడు తలచుకుంటే హింస ఏ సమస్యకూ పరిష్కారం కాదని భావిస్తున్నట్లు కయాదు తెలిపారు. అయితే ఆ సమయంలో ఎదురైన భయం, మానసిక ఒత్తిడి, నిరంతర వేధింపుల కారణంగానే అలా స్పందించాల్సి వచ్చిందని వివరించారు. సాధారణంగా తాను ప్రశాంత స్వభావం కలిగిన వ్యక్తినని, కానీ అన్యాయాన్ని ఎప్పటికీ మౌనంగా భరించకూడదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ప్రస్తుతం కయాదు లోహర్ పలు భాషల్లో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆమె నటించిన ‘ఇధయం మురళి’ జూలై 10న విడుదల కానుండగా, ‘ఇమ్మోర్టల్’ జూలై 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘ది ప్యారడైజ్’, ‘ఖలీఫా’, ‘ఐ యామ్ గేమ్’ వంటి చిత్రాల్లోనూ ఆమె నటిస్తున్నారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!