ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeతెలంగాణకాంగ్రెస్ పార్టీ అక్బర్ పేట భూంపల్లి మండల అధ్యక్షుడిగా గుండా శంకర్ నియామకం

కాంగ్రెస్ పార్టీ అక్బర్ పేట భూంపల్లి మండల అధ్యక్షుడిగా గుండా శంకర్ నియామకం

కాంగ్రెస్ పార్టీ అక్బర్ పేట భూంపల్లి మండల అధ్యక్షుడిగా గుండా శంకర్ నియామకం

అక్బర్ పేట భూంపల్లి జులై 01, ఆశ్వి అప్డేట్స్

అక్బరుపేట భూంపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గుండా శంకర్ ను నియమిస్తున్నట్లు టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు శంకర్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,రాష్ట్ర టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, టిపిసిసి ప్రజలతో ముఖాముఖి కమిటీ కన్వీనర్ మద్దుల గాల్ రెడ్డి, మండల సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. శంకర్ నియామకం పట్ల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!