ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeతెలంగాణకేటీఆర్‌, హరీశ్‌రావును అదుపులో పెట్టండి.. కేసీఆర్‌కు మంత్రి పొన్నం విజ్ఞప్తి

కేటీఆర్‌, హరీశ్‌రావును అదుపులో పెట్టండి.. కేసీఆర్‌కు మంత్రి పొన్నం విజ్ఞప్తి

కేటీఆర్‌, హరీశ్‌రావును అదుపులో పెట్టండి.. కేసీఆర్‌కు మంత్రి పొన్నం విజ్ఞప్తి

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు తీరుపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. వారిద్దరినీ అదుపులో పెట్టాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. గన్‌పార్క్ వద్ద గురువారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

“కేసీఆర్ గారిని నేను కోరుతున్నాను.. ఒక్కసారి కేటీఆర్‌, హరీశ్‌రావును అదుపులో పెట్టుకోండి. లేకుంటే మీకు చెడ్డపేరు వస్తుంది” అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రతరమయ్యాయి. ప్రభుత్వ పాలన, గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు సహా పలు అంశాలపై కేటీఆర్‌, హరీశ్‌రావు అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ మంత్రులు కూడా బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండిస్తూ ప్రతి విమర్శలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేటీఆర్‌, హరీశ్‌రావు వ్యవహారశైలిపై కేసీఆర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారితీసింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!