ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్చర్చకు సవాల్ విసిరి గైర్హాజరు.. మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ నేతల విమర్శలు

చర్చకు సవాల్ విసిరి గైర్హాజరు.. మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ నేతల విమర్శలు

చర్చకు సవాల్ విసిరి గైర్హాజరు.. మంత్రి జూపల్లిపై బీఆర్ఎస్ నేతల విమర్శలు

హైదరాబాద్: రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ పాలనపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి కృష్ణారావు నిర్ణీత సమయానికి హాజరుకాకపోవడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. మంత్రి సవాల్ మేరకు కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ గురువారం ఉదయం తెలంగాణ భవన్‌కు చేరుకుని చర్చకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

జూపల్లి కోసం తెలంగాణ భవన్ ప్రధాన హాల్‌లో ప్రత్యేకంగా కుర్చీ ఏర్పాటు చేయడంతో పాటు శాలువా, పూలబొకే సిద్ధం చేసినట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. చర్చ నిర్వహించేందుకు మైక్, సౌండ్ సిస్టమ్ సహా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ మంత్రి హాజరుకాలేదని ఆరోపించారు.

అనంతరం చర్చ వేదికను గన్‌పార్క్‌కు మార్చాలని మంత్రి జూపల్లి సూచించినట్లు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. దీంతో గన్‌పార్క్‌కు బయలుదేరిన హరీశ్‌రావు సహా పలువురు నాయకులను పోలీసులు అడ్డుకుని అదుపులోకి తీసుకొని కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.

హరీశ్‌రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తెలంగాణ భవన్‌కు రాలేకపోతే పోలీస్ స్టేషన్‌కైనా వచ్చి చర్చించాలని మంత్రులకు సవాల్ విసిరారు. అయితే మంత్రులు అక్కడికీ రాలేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.

ఈ పరిణామాలతో రాష్ట్ర అప్పులు, గురుకుల టెండర్లు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై అధికార–ప్రతిపక్షాల మధ్య రాజకీయ వివాదం మరింత ముదిరింది. బహిరంగ చర్చకు ఎవరు సిద్ధంగా ఉన్నారన్న అంశంపై ఇరు పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!