ePaper
Monday, August 31, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ

తెలంగాణలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ.. హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలో మార్పులు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మార్పులతో హెచ్‌ఎండీఏ (HMDA), జీహెచ్‌ఎంసీ (GHMC)లో కీలక బాధ్యతల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి.

ప్రస్తుతం హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్‌గా పనిచేస్తున్న టి. వెంకన్నను గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) కమిషనర్‌గా బదిలీ చేశారు.

అలాగే జీహెచ్‌ఎంసీ శంషాబాద్ జోనల్ కమిషనర్‌, అదనపు కమిషనర్‌ (ఎన్నికల విభాగం)గా బాధ్యతలు నిర్వహిస్తున్న కే. చంద్రకళకు హెచ్‌ఎండీఏ జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ (కోర్ అర్బన్ రీజియన్, ల్యాండ్ పూలింగ్, మెట్రోరైల్) పోస్టుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

ఎన్నికల ప్రక్రియలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న చంద్రకళను హెచ్‌ఎండీఏకు బదిలీ చేయడం, ఆమె స్థానంలో వెంటనే మరొక అధికారిని నియమించకపోవడం అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా బదిలీలతో పట్టణ పరిపాలనలో మరిన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!