ePaper
Monday, August 31, 2026
ePaper
Homeతెలంగాణదక్షిణాఫ్రికాలో ఘోర విమాన ప్రమాదం.. తెలంగాణకు చెందిన ట్రైనీ పైలట్ మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర విమాన ప్రమాదం.. తెలంగాణకు చెందిన ట్రైనీ పైలట్ మృతి

దక్షిణాఫ్రికాలో ఘోర విమాన ప్రమాదం.. తెలంగాణకు చెందిన ట్రైనీ పైలట్ మృతి

హనుమకొండ: దక్షిణాఫ్రికాలో జరిగిన శిక్షణ విమాన ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువ ట్రైనీ పైలట్ సుమంత్ (24) మృతి చెందడం విషాదాన్ని నింపింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తికి చెందిన సుమంత్ గత రెండేళ్లుగా దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో పైలట్ శిక్షణ పొందుతున్నాడు.

శనివారం సాధారణ శిక్షణలో భాగంగా విమానం నడుపుతుండగా ప్రమాదవశాత్తు శిక్షణ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో సుమంత్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

సుమంత్ మృతవార్త తెలియడంతో హసన్‌పర్తిలోని ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పైలట్ కావాలన్న కలతో విదేశాలకు వెళ్లిన యువకుడు ప్రమాదంలో మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

మృతదేహాన్ని భారత్‌కు తీసుకురావడానికి అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషాద ఘటనపై పలువురు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబానికి ధైర్యం చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!