ePaper
Friday, May 1, 2026
ePaper
Homeతెలంగాణప్రతి విజయానికి మూలం శ్రమ - ప్రతి అభివృద్ధికి బలం కార్మికులు

ప్రతి విజయానికి మూలం శ్రమ – ప్రతి అభివృద్ధికి బలం కార్మికులు

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ :  శ్రమజీవుల కష్టానికి గౌరవం, గుర్తింపునిచ్చే ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ (May Day) సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కార్మిక లోకానికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. కష్టం చేసిన ప్రతి చేతి విలువను గుర్తించి, సమానత్వం, న్యాయం, గౌరవం కోసం కలిసి ముందుకు సాగుదామని ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు.“ప్రతి కార్మికుడి చెమట చుక్కలో మన సమాజ భవిష్యత్తు దాగి ఉంది. కార్మికుల అంకితభావం, కష్టపడే మనస్తత్వం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుంది. వ్యవస్థీకృత, అసంఘటిత కార్మికుల హక్కులను కాపాడటంలో ప్రజాప్రభుత్వం నిరంతరం పాటుపడుతుంది” అని చెప్పారు.కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల ద్వారా లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తున్నదని పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం, వారికి రూ. 5 లక్షల ప్రమాద బీమా అమలు చేశామని తెలిపారు.రాష్ట్రంలో ఏళ్ల తరబడి ప్రభుత్వ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తూ దేశానికే తలమానికంగా ఉన్న సింగరేణి కార్మికులకు, దసరా, దీపావళి పండుగలకు ముందే బోనస్ చెల్లించడం జరిగిందన్నారు.సింగరేణి చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్ట్‌ కార్మికులకు రూ. 5 వేలు చొప్పున బోనస్ ఇచ్చినట్టు గుర్తు చేశారు. దాంతోపాటు, పలు బ్యాంకుల సహకారంతో కార్మికులకు కోటి రూపాయల బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన‌ట్టు వివ‌రించారు.గల్ఫ్ దేశాల్లో పని చేసే తెలంగాణ కార్మికుల సంక్షేమానికి ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు చెప్పారు. తెలంగాణ కార్మికులు ఆయా దేశాల్లో ఏ కారణంతో మరణించినా, వారి కుటుంబ సభ్యులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించడం వంటి అనేక కార్మిక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి గారు వివరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!