ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeసినీమాఫుడ్ డెలివరీ బాయ్‌తో ఘర్షణ.. వైరల్ వీడియోతో వివాదంలో నటుడు అఖిల్ రాజ్

ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఘర్షణ.. వైరల్ వీడియోతో వివాదంలో నటుడు అఖిల్ రాజ్

ఫుడ్ డెలివరీ బాయ్‌తో ఘర్షణ.. వైరల్ వీడియోతో వివాదంలో నటుడు అఖిల్ రాజ్

హైదరాబాద్: తెలుగు నటుడు అఖిల్ రాజ్‌కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారంలో పొరపాటు జరగడంతో ఫుడ్ డెలివరీ బాయ్‌తో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

సమాచారం ప్రకారం, డెలివరీ బాయ్ పొరపాటున వేరొకరి ఆర్డర్‌ను అందజేయడంతో అఖిల్ రాజ్ అసహనం వ్యక్తం చేశారు. తన తప్పును గుర్తించిన డెలివరీ సిబ్బంది వెంటనే క్షమాపణలు చెప్పినప్పటికీ, వాగ్వాదం తీవ్రరూపం దాల్చినట్లు వైరల్ వీడియోలో కనిపిస్తోంది. ఈ క్రమంలో అఖిల్ రాజ్ డెలివరీ బాయ్‌పై దాడికి ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతుండగా, పలువురు నెటిజన్లు సేవా రంగంలో పనిచేసే ఉద్యోగులతో గౌరవంగా వ్యవహరించాలని సూచిస్తూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, ఈ ఘటనపై అఖిల్ రాజ్ నుంచి అధికారిక స్పందన ఇంకా వెలువడలేదు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!