ePaper
Monday, June 22, 2026
ePaper
Homeజాతియంఢిల్లీరాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చ

రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ భేటీ.. రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చ

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులు, రక్షణ శాఖ భూముల బదిలీ అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రతిపాదిత గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం రక్షణ శాఖకు చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ప్రాజెక్టు కీలకమని రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు.

అదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధి అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించారు. విమానాశ్రయం విస్తరణ, కార్గో, హ్యాంగర్, ఎంఆర్వో (MRO) సదుపాయాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

అలాగే మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో డీఆర్‌డీఓ/డీఆర్‌డీఎల్‌కు సంబంధించిన కీలక ప్రాజెక్టులను మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రక్షణ, పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కేంద్రం సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు సంబంధించిన పలు అంశాలపై కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు మరియు ప్రాజెక్టులు తీసుకురావడంపై దృష్టి సారించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!