ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్హిందూపూర్ లారీ.. తూప్రాన్ అధికారుల ఎంట్రీ...

హిందూపూర్ లారీ.. తూప్రాన్ అధికారుల ఎంట్రీ…

​హిందూపూర్ లారీ.. తూప్రాన్ అధికారుల ఎంట్రీ.. చివరికి ధాన్యంతో బోల్తా!

​తూప్రాన్, మే 22 (ఆశ్వీ అప్డేట్స్)
తూప్రాన్ మండలం అల్లాపూర్ శివారులోని హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద శుక్రవారం రాత్రి ఒక ధాన్యం లారీ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. లారీ సామర్థ్యానికి మించి అదనపు లోడ్ వేయడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
​అసలేం జరిగిందంటే..?
​కిష్టాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రం నుండి సుమారు 800 బస్తాల ధాన్యంతో ఒక లారీ ‘నవదుర్గ పారాబైల్డ్ రైస్ మిల్లు’కు బయలుదేరింది. అయితే, రైస్ మిల్లు వద్ద వాహనాలు నిలపడానికి సరైన పార్కింగ్ స్థలం లేకపోవడంతో, డ్రైవర్ లారీని సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్దకు తీసుకువచ్చాడు. అక్కడ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్న క్రమంలో గజ్వేల్-తూప్రాన్ ప్రధాన రహదారిపై లారీ ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి రోడ్డుపై బోల్తా కొట్టింది. లారీలో ఉన్న ధాన్యం బస్తాలన్నీ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి.
​రెవెన్యూ అధికారులు పట్టుబట్టడంతోనే..
​ఈ లారీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని కిలారి హిందూపూర్ నుండి హైదరాబాద్‌కు బస్సు సామాగ్రితో వచ్చిన ఈ లారీ, అక్కడ అన్‌లోడ్ ముగించుకుని ఖాళీగా తిరిగి వెళ్తోంది. అయితే, తూప్రాన్ వద్ద ఈ వాహనాన్ని తనిఖీ చేసిన రెవెన్యూ అధికారులు, ధాన్యం రవాణా కోసం దీనిని కిష్టాపూర్ కొనుగోలు కేంద్రానికి పంపించారు.​ప్రమాదం జరిగిన సమయంలో రహదారిపై ఇతర వాహనాల రద్దీ తక్కువగా ఉండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుపై పడిపోయిన ధాన్యాన్ని పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నారు.

​”లారీ సామర్థ్యానికి మించి అదనంగా ధాన్యం బస్తాలను లోడ్ చేశారు. ఆ విపరీతమైన అదనపు బరువు (ఓవర్ లోడ్) కారణంగానే లారీ ‘చేసిస్’ (Chassis) విరిగిపోయి బోల్తా కొట్టింది.”

— సుహేబ్ ఖాన్, లారీ యాజమాని

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!