చెర్రీ కిడ్స్ ప్లే స్కూల్ రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్

కొంపల్లి: కొంపల్లి సమీపంలోని గజాననా హోమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన చెర్రీ కిడ్స్ ప్లే స్కూల్ రెండో బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించే విద్యాసంస్థలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. చిన్నారుల భవిష్యత్తును తీర్చిదిద్దే దిశగా చెర్రీ కిడ్స్ ప్లే స్కూల్ నిర్వాహకులు చేస్తున్న కృషిని అభినందిస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొంపల్లి ప్రెసిడెంట్ సతీష్ సాగర్, మాజీ కౌన్సిలర్లు రాజిరెడ్డి, మల్లికార్జున్, సీనియర్ నాయకులు శివాజీ, సరిత, జోరక జగన్తో పాటు పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
నూతన బ్రాంచ్ ప్రారంభంతో కొంపల్లి పరిసర ప్రాంతాల చిన్నారులకు నాణ్యమైన ప్రాథమిక విద్యా సౌకర్యాలు మరింత అందుబాటులోకి వస్తాయని నిర్వాహకులు తెలిపారు.
