మహేశ్వరం కాంగ్రెస్ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహణ
ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు
మహేశ్వరం: ఈ నెల 10వ తేదీన ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డెవలప్మెంట్ అథారిటీ మరియు స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఘనంగా నిర్వహించారు.
కొత్తపేటలోని ‘పాపడం బ్లూ’ హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి, టీపీసీసీ సభ్యుడు దేప భాస్కర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బోయిని మహేందర్ యాదవ్తో పాటు రామకృష్ణపురం, ఎన్టీఆర్ నగర్, సరూర్‌నగర్, డాక్టర్స్ కాలనీ డివిజన్ల ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా డెవలప్మెంట్ అథారిటీ, స్కిల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 10న జరిగే కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, యువత, ప్రజలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందని, యువతకు నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి అవకాశాలు కల్పించడంలో స్కిల్ యూనివర్సిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ సమావేశంలో డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
