ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా

తిరుమల: ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీశ్ కుమార్ గుప్తా శుక్రవారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.

శ్రీవారి దర్శనం అనంతరం టీటీడీ ఈవో ఎం. రవిచంద్ర డీజీపీకి వేద ఆశీర్వచనం అందజేయించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, ల్యామినేట్ చేసిన శ్రీవారి చిత్రపటాన్ని అందించి సత్కరించారు.

రంగనాయకుల మండపంలో ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, ఈ కార్యక్రమంలో టీటీడీ సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డీఈవో లోకనాథం తదితర అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!