ePaper
Monday, August 31, 2026
ePaper
Homeతెలంగాణహైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. చట్టాన్ని మీరితే చర్యలు తప్పవని హెచ్చరిక

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. చట్టాన్ని మీరితే చర్యలు తప్పవని హెచ్చరిక

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. చట్టాన్ని మీరితే చర్యలు తప్పవని హెచ్చరిక

హైదరాబాద్: హైడ్రా (HYDRAA) వ్యవహారశైలిపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. న్యాయస్థానం ఆదేశాలను పట్టించుకోకుండా ముందుగా కూల్చివేతలు చేపట్టి, తర్వాత వాటికి సమర్థనలు వెతకడం సరికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

కూకట్‌పల్లిలోని భూ వివాదానికి సంబంధించిన విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు అనుమతి లేకుండా స్థలంలో కాంపౌండ్ గోడలు, భద్రతా గదులు కూల్చివేయడం, విద్యుత్ సరఫరా నిలిపివేయడం, యంత్రాలను ధ్వంసం చేయడం వంటి చర్యలు చట్ట విరుద్ధమని పేర్కొంది.

కోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిన ప్రభుత్వ సంస్థలే వాటిని ఉల్లంఘించడం ఆందోళనకరమని న్యాయస్థానం అభిప్రాయపడింది. భూస్వాముల హక్కులను పరిరక్షించాలని, కూల్చివేసిన నిర్మాణాలను పునరుద్ధరించి, స్థలాన్ని యథాతథ స్థితికి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది.

అంతేకాకుండా, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సంబంధిత అధికారులపై వ్యక్తిగత బాధ్యత కూడా విధించే అవకాశం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!