ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeజాతియంరూ.99 లక్షల సబ్సిడీపై కేంద్ర మంత్రి వివరణ.. రాజకీయంగా దుమారం

రూ.99 లక్షల సబ్సిడీపై కేంద్ర మంత్రి వివరణ.. రాజకీయంగా దుమారం

రూ.99 లక్షల సబ్సిడీపై కేంద్ర మంత్రి వివరణ.. రాజకీయంగా దుమారం

జైపూర్: రాజస్థాన్‌లో దోసకాయ (కీరదోస) సాగు ప్రాజెక్టుకు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి రూ.99 లక్షలకు పైగా ప్రభుత్వ సబ్సిడీ పొందిన వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుండగా, మంత్రి తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.

భగీరథ్ చౌదరి మాట్లాడుతూ, తాను 2018లోనే రైతుగా ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నానని, అప్పటికి తాను కేంద్ర మంత్రిగా లేనని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే సబ్సిడీ పొందానని, ఈ విషయంలో ఎలాంటి సమాచారం దాచిపెట్టలేదని స్పష్టం చేశారు.

ఈ సబ్సిడీ జాతీయ ఉద్యానవన అభివృద్ధి బోర్డు (NHB) ద్వారా మంజూరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అదే శాఖకు సంబంధించిన మంత్రిత్వ బాధ్యతల్లో ఉండటంతో ప్రయోజనాల సంఘర్షణ (Conflict of Interest) అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేసింది. అయితే అన్ని నిబంధనలు పాటించి రైతుగా మాత్రమే ఈ ప్రయోజనం పొందానని కేంద్ర మంత్రి మరోసారి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!