ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeఅంతర్జాతీయంసౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. అరామ్‌కోకు చెందిన విమానం కుప్పకూలి 14 మంది మృతి

సౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. అరామ్‌కోకు చెందిన విమానం కుప్పకూలి 14 మంది మృతి

సౌదీలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. అరామ్‌కోకు చెందిన విమానం కుప్పకూలి 14 మంది మృతి

రియాద్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రాంతం రాస్ తనూరాలో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు సంస్థల్లో ఒకటైన సౌదీ అరామ్‌కోకు చెందిన హెలికాప్టర్ ఆదివారం ఉదయం కుప్పకూలినట్లు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ప్రమాదం ఉదయం సుమారు 6 గంటల సమయంలో చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మంది సౌదీ పౌరులు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, దీనిపై సంబంధిత శాఖలు సమగ్ర దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

ఈ విషాద ఘటనపై సౌదీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు తెలిపింది. దర్యాప్తు నివేదిక వచ్చిన అనంతరం ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!