19 ఏళ్ల తర్వాత ‘ఆవారాపన్ 2’ టీజర్ విడుదల.. ఇమ్రాన్ హష్మీ రీ-ఎంట్రీకి అభిమానుల ఫుల్ రెస్పాన్స్
ముంబై: బాలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రం **’ఆవారాపన్’**కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఆవారాపన్ 2’ అధికారిక టీజర్ విడుదలైంది. తొలి భాగం విడుదలై 19 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా చిత్రబృందం టీజర్‌ను విడుదల చేయగా, ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
టీజర్‌లో ఇమ్రాన్ హష్మీ మరోసారి శివమ్ పండిట్ పాత్రలో కనిపించారు. “దర్ద్ సే పురానా రిష్తా హై మేరా” అనే డైలాగ్‌తో పాటు పాత చిత్రంలోని భావోద్వేగాలను గుర్తు చేసే సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. దీంతో సోషల్ మీడియాలో టీజర్ వేగంగా వైరల్ అవుతోంది.
ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీతో పాటు దిశా పటానీ, షబానా ఆజ్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను విశేష్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ‘ఆవారాపన్’ చిత్రంలోని యాక్షన్, ఎమోషన్‌ను కొనసాగిస్తూ సరికొత్త కథతో ఈ సీక్వెల్ రూపొందిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
‘ఆవారాపన్ 2’ చిత్రం ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ విడుదలతో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
