ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeసినీమారాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. తిరుచ్చి ఉపఎన్నికపై జోరుగా ప్రచారం

రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. తిరుచ్చి ఉపఎన్నికపై జోరుగా ప్రచారం

రాజకీయాల్లోకి త్రిష ఎంట్రీ?.. తిరుచ్చి ఉపఎన్నికపై జోరుగా ప్రచారం

చెన్నై: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం తమిళనాడులో జోరుగా సాగుతోంది. తిరుచ్చి అసెంబ్లీ ఉపఎన్నికలో అధికార పార్టీ తరఫున ఆమెను బరిలోకి దించే అవకాశాలపై రాజకీయ, సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

తిరుచ్చి ఉపఎన్నికకు సంబంధించి తొలుత నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ పేరు వినిపించింది. అయితే ఆయన పోటీ నుంచి తప్పుకుంటారనే వార్తల నేపథ్యంలో ఇప్పుడు త్రిష పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అధికార పార్టీతో ఆమెకు ఉన్న సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.

అయితే త్రిష కానీ, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కానీ ఈ ప్రచారంపై ఇప్పటివరకు స్పందించలేదు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న చర్చలు ఊహాగానాలకే పరిమితమయ్యాయి. అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ఇక సినీ రంగంలో త్రిష వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలైన చిత్రాలతో విజయాలు అందుకున్న ఆమె, మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రంతో పాటు మరికొన్ని భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. రెండు దశాబ్దాలకుపైగా సినీ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న త్రిష రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!