ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeతెలంగాణబీజేపీ నేత ఇంటిపై దాడి.. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే ముందస్తు అరెస్టులు

బీజేపీ నేత ఇంటిపై దాడి.. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే ముందస్తు అరెస్టులు

కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: బీజేపీ నాయకులు

చిట్యాల,ఆశ్వి సెప్టెంబర్ 2: నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు డా. వర్శిత్ రెడ్డి నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి ఇంటిని ధ్వంసం చేయడంతో పాటు ఆయన తల్లితో సహా కుటుంబ సభ్యులపై భౌతిక దాడికి పాల్పడటాన్ని చిట్యాల బీజేపీ మండల, పట్టణ శాఖలు తీవ్రంగా ఖండించాయి.

 

దాడికి గురైన బీజేపీ జిల్లా అధ్యక్షులు వర్శిత్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు నల్గొండకు వెళ్తున్న బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేయడాన్ని బీజేపీ మండల అధ్యక్షులు పీకే వెంకన్న ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ తీవ్రంగా తప్పుబట్టారు.

 

దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం, బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు వెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని వారు ఆరోపించారు. అధికార పార్టీ కార్యకర్తల దాడులను అడ్డుకోకుండా, బాధితులకు మద్దతుగా నిలిచే వారిని అరెస్ట్ చేయడం తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని విమర్శించారు.

 

“దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి. బీజేపీ నాయకుల అక్రమ అరెస్టులను తక్షణమే ఉపసంహరించుకోవాలి” అని బీజేపీ చిట్యాల మండల, పట్టణ శాఖలు డిమాండ్ చేశాయి.

 

అరెస్టైన బీజేపీ నాయకులు

 

అరెస్టైన వారిలో బీజేపీ మండల అధ్యక్షులు పీకే వెంకన్న ముదిరాజ్, పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్, సీనియర్ నాయకులు అశోక్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీనివాస్, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు గంజి గోవర్ధన్, మండల ప్రధాన కార్యదర్శి మండల నరసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఉన్న విష్ణు, సీనియర్ నాయకులు కంచర్ల శంకర్ రెడ్డి, పట్టణ నాయకులు వైరాల రాహుల్, పిల్లి రవి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!