ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeతెలంగాణఆడబిడ్డ పుడితే 'ఐదు వేల' ఫిక్స్‌డ్ డిపాజిట్: మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ చెలిమెల రాములు!

ఆడబిడ్డ పుడితే ‘ఐదు వేల’ ఫిక్స్‌డ్ డిపాజిట్: మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ చెలిమెల రాములు!

ఆడబిడ్డ పుడితే ‘ఐదు వేల’ ఫిక్స్‌డ్ డిపాజిట్: మాట నిలబెట్టుకున్న కౌన్సిలర్ చెలిమెల రాములు!

తూప్రాన్ మున్సిపాలిటీలో అరుదైన దృశ్యం.. ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చిన 13వ వార్డు కౌన్సిలర్.. మున్సిపల్ కమిషనర్ సమక్షంలో లబ్ధిదారులకు బాండ్ అందజేత!

తూప్రాన్ జూన్ 8 (ఆశ్వి అప్డేట్స్ )

రాజకీయాల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకునే నాయకులు అరుదుగా ఉంటారు. కానీ, తాను ఇచ్చిన హామీని గుండెల్లో పెట్టుకొని, ఆడబిడ్డల భవిష్యత్తుకు భరోసానిస్తూ తూప్రాన్ మున్సిపాలిటీ 13వ వార్డు కౌన్సిలర్ చెలిమెల రాములు ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన వార్డులో ఏ దంపతులకైనా ఆడబిడ్డ జన్మిస్తే.. ఆ పాప పేరిట తన సొంత డబ్బుల నుండి  5,000 వేల రూపాయలు ఫిక్స్‌డ్ డిపాజిట్   ఎన్నికల సమయంలో ఆయన ఓటర్లకు మాట ఇచ్చారు.నేడు ఆ మాటను అక్షరాలా నిజం చేసి చూపిస్తూ, వార్డు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు.

మమత – భాస్కర్ దంపతులకు రూ. 5000 పోస్టల్ బాండ్!

13వ వార్డుకు చెందిన  కారంగుల మమత – భాస్కర్ దంపతులకు ఇటీవల ఆడబిడ్డ జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న కౌన్సిలర్ చెలిమెల రాములు తాను ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే స్పందించారు. ఆ పాప భవిష్యత్తు కోసం రూ. 5,000 విలువైన పోస్టల్ ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్‌ను సిద్ధం చేయించారు.సోమవారం తూప్రాన్ మున్సిపాలిటీలో 4, 9, 10, 13 వార్డులకు సంబంధించి నిర్వహించిన అధికారిక  వార్డు సభల వేదికగా, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ సమక్షంలో ఆ పోస్టల్ డిపాజిట్ బాండ్‌ను  ఆ దంపతులకు అత్యంత ఘనంగా అందజేశారు.

‘రాములన్న’ సేవలకు వార్డు ప్రజల జేజేలు!

ఆడపిల్లల చదువుకు, భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా కౌన్సిలర్ రాములు తీసుకున్న ఈ నిర్ణయంపై మున్సిపల్ కమిషనర్‌తో పాటు తోటి ప్రజాప్రతినిధులు ప్రశంసల వర్షం కురిపించారు.రాజకీయాలకతీతంగా, కేవలం ప్రజలకు సేవ చేయాలనే తపనతో, ఆడబిడ్డలను మహాలక్ష్మిగా భావించి రాములు చేస్తున్న ఈ సేవలు అందరికీ ఆదర్శప్రాయం. ఎన్నికల హామీలను అటకెక్కించే ఈ రోజుల్లో.. ఇచ్చిన మాట కోసం సొంత నిధులు వెచ్చించడం ఆయన నిబద్ధతకు నిదర్శనం అని స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం తూప్రాన్ మున్సిపాలిటీలో కౌన్సిలర్ చెలిమెల రాములు చేస్తున్న సేవలు, ఆయన మానవతా దృక్పథంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!