ePaper
Thursday, August 6, 2026
ePaper
Homeతెలంగాణఆశ్వి న్యూస్ ఎఫెక్ట్ .. విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసిన అధికారులు 

ఆశ్వి న్యూస్ ఎఫెక్ట్ .. విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసిన అధికారులు 

ఆశ్వి న్యూస్ ఎఫెక్ట్ .. విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసిన అధికారులు

అక్బరుపేట/భూంపల్లి మే 26 (అశ్వి అప్డేట్స్)

అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామంలో వంగిన విద్యుత్ స్తంభాన్ని వైర్లను విద్యుత్ అధికారులు మంగళవారం పునరుద్ధరించారు. దుబ్బాక ఏడి గంగాధర్, మండల ఎఈ కనకయ్య తమ విద్యుత్ సిబ్బందితో కలిసి స్తంభాలను,వైర్లను ట్రాక్టర్ క్రేన్ సహాయంతో  సరిచేసారు. నెల రోజుల క్రితం వచ్చిన గాలి, వానకు 33 కేవీ విద్యుత్ స్తంభం తీగలు విరిగిపోయి స్తంభం ఒరిగిపోయింది. అధికారులు పట్టించుకోకపోవడంతో రైతన్నల విద్యుత్ బాధలను   ‘పంట పొలాల్లో ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం శీర్షికన ‘ఆశ్వి అప్డేట్స్’లో కథనం ప్రచురితమైంది. కాగా విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను పునరుద్ధరించారు. అనంతరం రైస్ మిల్ వద్ద 33 కెవి స్థంభం ఒరగడంతో ప్రమాదం జరగకుండా కొత్త స్తంభాన్ని ఏర్పరిచారు.దీంతో రైతులు అనందం వ్యక్తం చేశారు. లైన్మెన్ చంద్రశేఖర్, లైన్ ఇన్స్పెక్టర్ సత్తయ్య,ఆపరేటర్ సంతోష్ రెడ్డి,నాగేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!