ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్పంట పొలాల్లో ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం

పంట పొలాల్లో ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం

పంట పొలాల్లో ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం

రైతుల ప్రాణాలకు తీవ్ర ముప్పు!

అక్బరుపేట/భూంపల్లి, మే 25 (ఆశ్వి అప్డేట్స్):

పంట పొలాల్లో విద్యుత్ స్తంభాలు కిందికి వంగి, హైటెన్షన్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతున్నప్పటికీ, పంట పొలాల్లోనూ ఒరిగిన 33 కేవీ విద్యుత్ స్తంభం మరమ్మత్తుల విషయంలో విద్యుత్ అధికారులు  అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని రైతులు గుండెల్లో గుబులు పెట్టుకొని పొలాల్లో పనులు చేసుకుంటున్నారు.

*నిర్లక్ష్యానికి నిలువుటద్దం..*

అక్బరుపేట భూంపల్లి మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన రైతు ఆరుగొండ జయరాములు పొలం వద్ద ఉన్న 33 కేవీ విద్యుత్ స్తంభం భూమిలోకి బాగా ఒరిగిపోయింది. దాంతోపాటు భారీ విద్యుత్ వైర్లు సైతం కిందికి వేలాడుతున్నాయి. ఈ దారుణ పరిస్థితి కళ్లముందే కనిపిస్తున్నా, విద్యుత్ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడుతున్నారు.

*రైతుల ఆందోళన*

వైర్లు చాలా కిందికి ఉండటంతో పొలాల్లోకి వెళ్లడానికే భయమేస్తోంది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరగాల్సి వస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా భారీ ప్రాణ నష్టం జరుగుతుంది.

*నాలుగు గ్రామాలకు నిలిచిపోనున్న విద్యుత్ సరఫరా

ఒకవేళ ఈ 33 కేవీ లైన్‌కు ప్రమాదం జరిగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, ఒక్క వీరారెడ్డిపల్లి మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్న మరికొన్ని గ్రామాలపై తీవ్ర ప్రభావం పడనుంది.ఖాజీపూర్,వీరారెడ్డిపల్లి,జంగపల్లి,అల్మాజిపూర్ఈ నాలుగు గ్రామాలకు పూర్తిగా కరెంట్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారులు స్పందించాలి

విద్యుత్ శాఖ అధికారుల ఘోర నిర్లక్ష్యం వల్లే నేడు ఈ దుస్థితి నెలకొందని స్థానిక రైతాంగం ఆరోపిస్తోంది. పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోకముందే.. అధికారులు తక్షణమే స్పందించి, ఒరిగిన విద్యుత్ స్తంభాన్ని నిటారుగా నిలబెట్టాలని, వేలాడుతున్న వైర్లను సరిచేసి తమ ప్రాణాలను, పంటలను కాపాడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!