ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeతెలంగాణగురుకుల టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. రూ.2,000 కోట్ల కుంభకోణంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ సవాల్

గురుకుల టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. రూ.2,000 కోట్ల కుంభకోణంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ సవాల్

గురుకుల టెండర్లపై బహిరంగ చర్చకు సిద్ధం.. రూ.2,000 కోట్ల కుంభకోణంపై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ సవాల్

హైదరాబాద్: తెలంగాణ గురుకుల విద్యాలయాల టెండర్లలో రూ.2,000 కోట్లకు పైగా అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్ మరోసారి ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్ర మంత్రులు బహిరంగ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఉదయం 11 గంటలకు బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రవీణ్‌కుమార్ తెలిపారు. తమ ఆరోపణలు అవాస్తవమని ప్రభుత్వం భావిస్తే సంబంధిత ఆధారాలతో వచ్చి ప్రజల ముందే వివరణ ఇవ్వాలని కోరారు. గురుకులాల టెండర్లలో నిబంధనలు మార్చి స్థానిక కాంట్రాక్టర్లకు అన్యాయం జరిగిందని ఆయన ఆరోపించారు.

అలాగే గురుకులాలకు సంబంధించిన యూనిఫాంలు, ట్రంక్ బాక్సులు, నోట్‌బుక్స్‌, ఇతర సామగ్రి కొనుగోళ్లలో పారదర్శకత పాటించలేదని, వివాదాస్పద సంస్థలకు కాంట్రాక్టులు ఇచ్చారంటూ పలు ప్రశ్నలు లేవనెత్తారు. విద్యా సంవత్సరం ప్రారంభమై రోజులు గడుస్తున్నా విద్యార్థులకు అవసరమైన సామగ్రి పూర్తిగా అందలేదని ఆయన పేర్కొన్నారు.

ఈ ఆరోపణలపై ప్రభుత్వం ఇప్పటికే వాటిని ఖండిస్తూ టెండర్ల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందని తెలిపింది. గురుకుల టెండర్ల అంశంపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ బహిరంగ చర్చపై ఆసక్తి నెలకొంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!