ePaper
Monday, August 31, 2026
ePaper
Homeతెలంగాణజూలై 5న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం.. విజయానికి నాంది పలుకుదాం: మాగంటి సునీత

జూలై 5న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం.. విజయానికి నాంది పలుకుదాం: మాగంటి సునీత

జూలై 5న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం.. విజయానికి నాంది పలుకుదాం: మాగంటి సునీత

హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులను మరింత బలోపేతం చేసే దిశగా జూలై 5న కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ నాయకురాలు మాగంటి సునీత ప్రకటించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు.

మాగంటి సునీత మాట్లాడుతూ, జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌కు ప్రజల మద్దతు బలంగా ఉందని, పార్టీ కార్యకర్తల ఐక్యతతో రానున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటామని అన్నారు. ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి పార్టీ విధానాలు, గత ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు.

జూలై 5 సమావేశంలో నియోజకవర్గ భవిష్యత్ కార్యాచరణ, పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాట ప్రణాళికపై చర్చించనున్నట్లు తెలిపారు. అన్ని డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని మాగంటి సునీత కోరారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!