ePaper
Monday, August 31, 2026
ePaper
Homebusinessఈ-కామర్స్‌లో భారీ డిస్కౌంట్ సేల్.. జూలైలో అమెజాన్, జియోమార్ట్ ప్రత్యేక ఆఫర్లు

ఈ-కామర్స్‌లో భారీ డిస్కౌంట్ సేల్.. జూలైలో అమెజాన్, జియోమార్ట్ ప్రత్యేక ఆఫర్లు

ఈ-కామర్స్‌లో భారీ డిస్కౌంట్ సేల్.. జూలైలో అమెజాన్, జియోమార్ట్ ప్రత్యేక ఆఫర్లు

న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు భారీ ఆఫర్లతో ముందుకొచ్చాయి. జూలై నెల ప్రారంభంలోనే అమెజాన్ ప్రైమ్ డే సేల్‌తో పాటు జియోమార్ట్ ప్రత్యేక డిస్కౌంట్ ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించాయి. దీంతో ఎలక్ట్రానిక్స్ నుంచి గృహోపకరణాల వరకు అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులు లభించనున్నాయి.

అమెజాన్ తన 10వ వార్షిక ప్రైమ్ డే సేల్‌ను జూలై 4 నుంచి 6 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనుంది. ఈ సందర్భంగా ప్రైమ్ సభ్యులకు ఎంపిక చేసిన ఉత్పత్తులపై 60 శాతం వరకు తగ్గింపులు, ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు, వేగవంతమైన డెలివరీ సదుపాయాలు అందించనున్నట్లు తెలిపింది. అలాగే ప్రైమ్ సభ్యత్వ రుసుమును కూడా తగ్గించి రూ.999కే అందుబాటులోకి తీసుకొచ్చింది.

మరోవైపు జియోమార్ట్ కూడా జూన్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల ప్రత్యేక సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ ఆఫర్లలో గృహోపకరణాలు, హోమ్ కేర్ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ యాక్సెసరీస్, ఎంపిక చేసిన 5జీ స్మార్ట్‌ఫోన్లపై ఆకర్షణీయమైన ధరలు ప్రకటించింది. ప్రముఖ బ్రాండ్ మొబైల్ ఫోన్లను ప్రత్యేక తగ్గింపు ధరలకు విక్రయించనున్నట్లు వెల్లడించింది.

పండుగల సీజన్‌కు ముందే వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ-కామర్స్ సంస్థలు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఆన్‌లైన్ విక్రయాలు మరింత పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!