ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homeతెలంగాణటిఆర్ఎస్ జెండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి

టిఆర్ఎస్ జెండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి

*టిఆర్ఎస్ జెండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి*

-గజ్వెల్ మునిసిపల్ కమీషనర్ కు దరఖాస్తు

గజ్వేల్ మే 29, (ఆశ్వి అప్డేట్స్)

టీఆర్ఎస్ పార్టీ పటిష్ఠతలో భాగంగా గజ్వేల్ మున్సిపల్ పరిధిలో టిఆర్ఎస్ జెండా గద్దెల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ శుక్రవారం ఆ పార్టీ జెండా పండుగ జిల్లా ఇంచార్జి కొట్టాల యాదగిరి ముదిరాజ్ గజ్వేల్ మున్సిపల్ కమిషనర్ వెంకట గోపాల్ కు దరఖాస్తు అందజేశారు. గజ్వేల్ ఇందిరా పార్కు చౌరస్తా, కోట మైసమ్మ ఆలయం, ప్రజ్ఞాపూర్ చౌరస్తా, ఆర్ అండ్ ఆర్ నిర్వాసిత కాలనీలో టిఆర్ఎస్ పార్టీ గద్దెల నిర్మాణం చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పర్యటించనుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని జెండా పండగ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ జెండా పండుగ రాష్ట్ర పరిశీలకుడు లోక రవిచంద్ర, నాయకులు ఇంద్రాగౌడ్, నరేందర్ రెడ్డి, ఎడ్ల నర్సింలు, శ్రీకాంత్, ప్రసాద్, చందు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!