ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్టీటీడీకి హైదరాబాద్ భక్తుడి రూ.45 లక్షల విరాళం

టీటీడీకి హైదరాబాద్ భక్తుడి రూ.45 లక్షల విరాళం

టీటీడీకి హైదరాబాద్‌కు చెందిన భక్తుడి రూ.45 లక్షల విరాళం

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి సేవా కార్యక్రమాలకు హైదరాబాద్‌కు చెందిన ఓ భక్తుడు ఉదారంగా విరాళం అందించారు. హైదరాబాద్‌కు చెందిన సాయి బాలాజీ డెవలపర్స్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.45 లక్షలు విరాళంగా అందజేసింది.

ఈ సందర్భంగా సంస్థ భాగస్వామి ఆకుల రవికుమార్ తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. భక్తుల కోసం నిర్వహిస్తున్న అన్నప్రసాద సేవలకు తమ వంతు సహకారం అందించడం ఆనందంగా ఉందని దాత తెలిపారు.

ఇక తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం 62,925 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 36,297 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.3.77 కోట్ల ఆదాయం లభించగా, 4.23 లక్షల లడ్డూలు విక్రయించినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. అలాగే 2.40 లక్షల మందికి అన్నప్రసాదం పంపిణీ చేసినట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!