ePaper
Thursday, September 3, 2026
ePaper
Homeక్రైమ్పిచ్చికుక్కల దాడిలో గొర్రెలు మృతి..

పిచ్చికుక్కల దాడిలో గొర్రెలు మృతి..

 

  •  చౌదర్పల్లి గ్రామంలో గొర్రెల మందపై పిచ్చికుక్కల దాడి

అక్బరుపేట భూంపల్లి జూన్ 27 ఆశ్వి అప్డేట్స్ : గొర్రెల మందపై పిచ్చికుక్కలు దాడి చేసిన సంఘటన అక్బర్ పేట భూంపల్లి మండలం చౌదర్పల్లి గ్రామంలో చోటుచేసుకుంది.గొర్రెల మంద పై దాడులు జరగడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు బండారి రాములు గొర్రెల మంద పై శనివారం తెల్లవారు జామున వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో 9 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా, సుమారు 50 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. గొర్రెల పెంపకమే జీవనాధారంగా ఉన్న తమకు ఈ దాడివల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని రాములు కన్నీటి పర్యంతలమయ్యాడు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!