ePaper
Wednesday, September 2, 2026
ePaper
Homeసినీమా'ఇడుపు కాయితం' టైటిల్‌పై ట్రోలింగ్.. తెలంగాణ నుంచి కౌంటర్

‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై ట్రోలింగ్.. తెలంగాణ నుంచి కౌంటర్

‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై ట్రోలింగ్.. తెలంగాణ యాసకు మద్దతుగా సోషల్ మీడియాలో కౌంటర్లు

హైదరాబాద్: ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా టైటిల్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభమైంది. సినిమా పేరుతో పాటు తెలంగాణ మాండలికంపై కొందరు వెటకారపు పోస్టులు చేయడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ యాస, మాండలికాన్ని అవమానించేలా పోస్టులు వైరల్ కావడంతో పలువురు తెలంగాణవాదులు, సినీ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ‘ఇడుపు కాయితం’ అనేది అచ్చమైన తెలంగాణ పదమని, దాని అర్థం ఆలుమగలు విడిపోతూ రాసుకునే అంగీకార పత్రం అని వివరిస్తూ సోషల్ మీడియాలో కౌంటర్ పోస్టులు పెడుతున్నారు.

ఈ సినిమాతో ప్రియదర్శి సరసన తెలంగాణ జానపద గాయని నాగదుర్గ కథానాయికగా నటిస్తోంది. తెలంగాణ భాష, సంస్కృతి, స్థానిక కథలను ప్రతిబింబించే సినిమాలను ప్రోత్సహించాల్సిన సమయంలో ఇలాంటి దుష్ప్రచారం చేయడం సరైంది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదిలా ఉండగా నటుడు రాహుల్ రామకృష్ణ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, “మా కథలను మా యాసలోనే చెబుతాం” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ‘ఇడుపు కాయితం’ టైటిల్‌పై జరుగుతున్న చర్చ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!