ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్మాసాయిపేట లో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు

మాసాయిపేట లో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు

 

*మాసాయిపేట లో జోరుగా అక్రమ మట్టి రవాణా*

మాసాయిపేట, మే 21 (ఆశ్వీ అప్డేట్స్)

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం నుండి చెట్ల తిమ్మాయిపల్లి వెళ్ళే మార్గంలో రాత్రి వేళల్లో జోరుగా అక్రమ మట్టి తవ్వకాలు సాగిస్తున్నారు. జేసీబీ, హిటాచీ, టిప్పర్ల సాయంతో ఇష్టారాజ్యంగా ప్రైవేటు వెంచర్లతో పాటు, పలు పరిశ్రమలకు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీసు అధికారులు స్పందించి, ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని నిబంధనలకు విరుద్ధంగా, యథేచ్ఛగా తవ్వేస్తూ, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్న అక్రమ మట్టి రవాణాను అడ్డుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!