మహబూబ్నగర్ ఆశ్వి అప్డేట్స్ మే 21: నేడు “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో భాగంగా నగరంలోని 37వ వార్డులో మేయర్ గుమ్మల మమత శ్రీనివాస్ పర్యటించారు. ఈ పర్యటనలో మున్సిపల్ కమిషనర్ రమాంజుల రెడ్డి, వార్డు కార్పొరేటర్ నందిగామ శ్రీలేఖ మరియు ఇతర మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.మేయర్ వార్డులోని ప్రతి వీధిని కాలినడకన తిరిగి, స్థానిక పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ముఖ్యంగా వీధి దీపాలు (Street Lights), సి.సి. రోడ్ల పరిస్థితి మరియు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (Under Drainage) వ్యవస్థలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులను ఆదేశించారు.వార్డు ప్రజలు తమ ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా మేయర్ గారి దృష్టికి తీసుకువచ్చారు. డ్రైనేజీ లీకేజీలు, కొత్త రోడ్ల అవసరం మరియు పారిశుధ్యంపై వినతులు అందజేశారు.ప్రజల సమస్యలను ఓపికగా విన్న మేయర్ గారు, “ప్రతి సమస్యను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తాం” అని హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపులు జరిపి, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు.
లోపాలను సరిదిద్దండి..! అధికారులకు ఆదేశం
0
45
Previous article
