ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స విమర్శలు.. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స విమర్శలు.. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం

రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై బొత్స విమర్శలు.. ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ఏర్పాట్లపై వైసీపీ ఎమ్మెల్సీ, శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. రాష్ట్రపతికి ప్రభుత్వ అతిథి గృహంలో కాకుండా ప్రైవేట్ హోటల్‌లో బస ఏర్పాటు చేయడం సరైన నిర్ణయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

మీడియాతో మాట్లాడిన బొత్స, రాష్ట్రపతి వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తికి ప్రభుత్వ అతిథి గృహంలోనే వసతి కల్పించాల్సిందని అన్నారు. ప్రభుత్వ వసతులను వినియోగించకుండా ప్రైవేట్ హోటల్‌ను ఎంపిక చేయడం వల్ల ప్రభుత్వ ఆస్తుల వినియోగంపై సందేహాలు తలెత్తుతున్నాయని వ్యాఖ్యానించారు. అవసరమైతే ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లను ఆధునీకరించాలని సూచించారు.

అదే సమయంలో అమరావతి ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు, రైతులతో మాట్లాడేందుకు వెళ్లిన వైసీపీ నాయకులపై దాడులు జరిగాయని బొత్స ఆరోపించారు. వారిపైనే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

రాష్ట్రంలో రైతులు గిట్టుబాటు ధరల కోసం ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వ ప్రాధాన్యత ప్రజా సమస్యల పరిష్కారంపైనే ఉండాలని బొత్స సత్యనారాయణ కోరారు. ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!