ePaper
Sunday, August 30, 2026
ePaper
Homeసినీమావిడాకులు తీసుకుంటున్నానంటూ షాక్.. చివరికి ప్రమోషనల్ వీడియో అని వెల్లడి

విడాకులు తీసుకుంటున్నానంటూ షాక్.. చివరికి ప్రమోషనల్ వీడియో అని వెల్లడి

విడాకులు తీసుకుంటున్నానంటూ షాక్.. చివరికి ప్రమోషనల్ వీడియో అని వెల్లడి

హైదరాబాద్: నటుడు, కమెడియన్ రంగస్థలం మహేష్ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలు అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. వ్యక్తిగత జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు, విడాకుల దిశగా వెళ్తున్నట్లు కనిపించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

మహేష్ మొదట భావోద్వేగంతో మాట్లాడిన వీడియోను విడుదల చేయగా, అనంతరం భార్యాభర్తల మధ్య వివాదం జరుగుతున్నట్లు మరో వీడియోను పంచుకున్నారు. దీంతో ఆయన వ్యక్తిగత జీవితంలో నిజంగానే ఏదైనా సమస్య ఎదురైందా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా సాగింది. అభిమానులు కూడా పెద్దఎత్తున స్పందిస్తూ ఆరా తీశారు.

అయితే తర్వాత అసలు విషయం బయటపడింది. ఈ వీడియోలన్నీ మహేష్ నటించిన ‘డి ఫర్ డివోర్స్’ షార్ట్ సిరీస్ ప్రచారంలో భాగంగా రూపొందించిన ప్రమోషనల్ కంటెంట్ అని వెల్లడైంది. దీంతో మొదట ఆందోళన చెందిన అభిమానులు ఊపిరి పీల్చుకోగా, ప్రచారం కోసం ఇలాంటి భావోద్వేగ అంశాలను ఉపయోగించడం సరైందేనా అంటూ సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!