లారీలు రావాలని రోడ్డెక్కి రాస్తారోకో ధర్నా చేపట్టిన రైతులు…
రోడ్డుకు ఇరువైపులా భారీగా నిలిచిపోయిన వాహనాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం
ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులు
చిన్న శంకరంపేట,మే 21 ( అశ్వి అప్డేట్స్ )
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నెల రోజులుగా పడుకోలు కాస్తున్న లారీలు రావడం లేదని, వరి వేస్తే రైతుల ఉరికి వస్తుందని, ధాన్యం కొనుగోలు చేయమంటే పండిన ధాన్యాన్ని చెరువులోనైనా పోసుకుంటామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం అంబాజీపేట గ్రామ శివారులో రైతులు మెదక్ రహదారిపై రైతులు సుమారు రెండు గంటల పాటు ధర్నా రాస్తారోకో చేపట్టారు దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధాన్యం కొనుగోలు వెంటనే వేగవంతం చేయాలని అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చేవరకు రోడ్డుపై నుంచి లేచేది లేదని భీష్మంచుకుని కూర్చున్నారు, విషయం తెలుసుకున్న ఎస్ఐ శివానందం సంఘటన స్థలానికి చేరుకొని రైతులను సముదాయించి రోజు ఒక లారీ పంపించే బాధ్యత నాదని రైతులకు సమస్య లేకుండా చూసుకుంటానని ఆయన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు, ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ నెల రోజులుగా కొనుగోలు కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న లారీలు రావడం లేదని ధాన్యం తూకం చేసి వారం రోజులు గడిచిన కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యం వెళ్లడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులు స్పందించి వెంటనే లారీలు పంపించి ధాన్యాన్ని తీసుకెళ్లాలని వారు కోరారు నాలుగు రోజుల క్రితం అధికారులు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదని రోజు ఒక లారీ పంపిస్తానని అధికారులు హామీ ఇవ్వడం జరిగిందని నాలుగు రోజులుగా ఒక్క లారీ కూడా రావడం లేదని ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీలు పంపించాలని వారు డిమాండ్ చేశారు, వరి వేయడంతో రైతులకు ఉరి వేసుకున్నట్టు అవుతుందని కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పని కాపులు కాయడం జరుగుతుందని ధాన్యం పై కప్పడానికి తెచ్చిన టాపర్లకే వెల రూపాయలు అద్దె చెల్లించడం జరుగుతుందని, ధాన్యాన్ని ఆరబెట్టిన దానికంటే చెరువులో పోసుకోవడమే మేలని వారు ఆవేదన వ్యక్తం చేశారు,
