ePaper
Saturday, June 20, 2026
ePaper
Homeతెలంగాణరికార్డ్ సృష్టించిన దాతర్‌పల్లి....

రికార్డ్ సృష్టించిన దాతర్‌పల్లి….

రికార్డ్ సృష్టించిన దాతర్‌పల్లి మెదక్ జిల్లాలోనే ధాన్యం కొనుగోళ్లు ముగించిన ఏకైక సెంటర్

-20 రోజుల్లో 3,273 క్వింటాళ్ల ధాన్యం సేకరణ

-లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేసి ఆదర్శంగా నిలిచిన ఐకేపీ కేంద్రం

తూప్రాన్,మే 31( ఆశ్వి అప్డేట్స్ )

మెదక్ జిల్లా తూప్రాన్ మండలం దాతర్ పల్లి గ్రామ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా వరి కోతలు, కొనుగోళ్లు సాగుతుండగా… అందరికంటే ముందుగా ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా ముగించి మెదక్ జిల్లాలోనే మొట్టమొదటి సెంటర్‌గా దాతర్‌పల్లి నిలిచింది. ఆదివారం ఈ కేంద్రాన్ని అధికారులు అధికారికంగా బంద్ చేశారు.

గత 20 రోజుల పాటు ఈ సెంటర్‌ను నిర్విరామంగా నిర్వహించారు. నిర్వాహకులు, అధికారుల సమన్వయంతో చుట్టుపక్కల రైతుల నుంచి ఇప్పటివరకు దాదాపు 3,273 క్వింటాళ్ల ధాన్యాన్ని సేకరించారు. ఎక్కడా రైతులకు ఎలాంటి ఇబ్బందులు, తూకాల్లో తేడాలు రాకుండా పారదర్శకంగా కొనుగోళ్లు జరిపి జిల్లాలోనే ఈ సెంటర్ టాప్‌లో నిలిచింది. ముగింపు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జయరాం, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) ప్రేమ్, జీపీవో (GPO) నాగరాజు, ఐకెపి సెంటర్ నిర్వాహకులు కీర్తన, తదితరులు పాల్గొన్నారు.

*అధికారుల హర్షం*

జిల్లాలోనే ధాన్యం కొనుగోళ్లను పూర్తి చేసిన ఏకైక తొలి కేంద్రంగా దాతర్‌పల్లి నిలవడం గర్వకారణంమని,రైతుల సహకారం, సిబ్బంది కష్టపడి పనిచేయడం వల్లే కేవలం 20 రోజుల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించగలిగాం అని మండల రెవెన్యూ, ఐకెపి అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!