ePaper
Monday, June 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్మూడు రోజుల పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్

మూడు రోజుల పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్

మూడు రోజుల పులివెందుల పర్యటనకు వైఎస్ జగన్.. ప్రజాదర్బార్‌లో వినతుల స్వీకరణ

పులివెందుల: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23 నుంచి 25వ తేదీ వరకు మూడు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకునే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైఎస్ జగన్, భాకరాపురం క్యాంపు కార్యాలయంలో నిర్వహించే ప్రజాదర్బార్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కూడా సమావేశమై పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

పర్యటనలో భాగంగా స్థానిక ప్రజల సమస్యలు, పార్టీ కార్యకలాపాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకోవడంపై జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మూడు రోజుల పర్యటన అనంతరం వైఎస్ జగన్ తిరిగి తాడేపల్లికి వెళ్లనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!