ePaper
Wednesday, August 5, 2026
ePaper
Homebusinessచికెన్, గుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యులకు పెరుగుతున్న భారం

చికెన్, గుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యులకు పెరుగుతున్న భారం

చికెన్, గుడ్ల ధరలకు రెక్కలు.. సామాన్యులకు పెరుగుతున్న భారం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడిగుడ్ల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. గత వారం రోజుల్లోనే చికెన్‌తో పాటు గుడ్ల ధరలు గణనీయంగా పెరగడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ కిలో ధర ప్రాంతాన్ని బట్టి రూ.300 నుంచి రూ.330 వరకు పలుకుతుండగా, విజయవాడలో కూడా దాదాపు ఇదే స్థాయిలో విక్రయిస్తున్నారు. మరోవైపు, నెల రోజుల క్రితం రూ.6–7 మధ్య ఉన్న ఒక్క కోడిగుడ్డు ధర ఇప్పుడు రూ.8కు చేరింది. దీంతో 30 గుడ్ల ట్రే ధర సుమారు రూ.240కు చేరుకుంది.

వ్యాపారుల ప్రకారం, ఎండల తీవ్రత కారణంగా పౌల్ట్రీ ఫారాల్లో కోళ్ల మరణాలు పెరగడం, మొక్కజొన్న, సోయాబీన్ వంటి దాణా ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి వ్యయం అధికమైంది. దీంతో పౌల్ట్రీ ఉత్పత్తి తగ్గి మార్కెట్లో సరఫరా తగ్గడంతో ధరలు పెరిగినట్లు చెబుతున్నారు.

చికెన్, గుడ్ల ధరలు పెరగడంతో నిత్యం వీటిని ఆహారంలో భాగంగా తీసుకునే కుటుంబాలపై ఆర్థిక భారం మరింత పెరిగింది. రాబోయే రోజుల్లో ఉత్పత్తి సాధారణ స్థితికి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!