ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeస్పోర్ట్స్సూపర్‌మ్యాన్‌లా ఎగిరి క్యాచ్ పట్టిన టామ్ బాంటన్.. సంజూ వికెట్ వైరల్

సూపర్‌మ్యాన్‌లా ఎగిరి క్యాచ్ పట్టిన టామ్ బాంటన్.. సంజూ వికెట్ వైరల్

సూపర్‌మ్యాన్‌లా ఎగిరి క్యాచ్ పట్టిన టామ్ బాంటన్.. సంజూ వికెట్ వైరల్

చెస్టర్-లీ-స్ట్రీట్: భారత్–ఇంగ్లాండ్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫీల్డర్ టామ్ బాంటన్ పట్టిన అద్భుత క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్‌మ్యాన్‌లా గాల్లోకి ఎగిరి ఆయన అందుకున్న క్యాచ్‌కు టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఔట్ కావడంతో అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో సంజూ శాంసన్ బౌండరీ కోసం ఆడిన షాట్‌ను టామ్ బాంటన్ అద్భుతంగా డైవ్ చేస్తూ అందుకోవడంతో సంజూ కేవలం ఒక పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. బాంటన్ ఫీల్డింగ్ మ్యాచ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

అనంతరం వర్షం కారణంగా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం కాకముందే మ్యాచ్ రద్దైంది. మ్యాచ్‌కు ఫలితం రాకపోయినా, టామ్ బాంటన్ పట్టిన అద్భుత క్యాచ్ మాత్రం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో “సూపర్‌మ్యాన్ క్యాచ్”, “టోర్నీలోనే బెస్ట్ క్యాచ్” అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!