ePaper
Sunday, September 20, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్దమ్ముంటే గన్‌పార్క్ వద్దే ఉండాలి.. మంత్రి జూపల్లికి కేటీఆర్ సవాల్

దమ్ముంటే గన్‌పార్క్ వద్దే ఉండాలి.. మంత్రి జూపల్లికి కేటీఆర్ సవాల్

దమ్ముంటే గన్‌పార్క్ వద్దే ఉండాలి.. మంత్రి జూపల్లికి కేటీఆర్ సవాల్

హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావుకు దమ్ముంటే గన్‌పార్క్ వద్దే ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్ర అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై చర్చకు వస్తానని ప్రకటించిన మంత్రి జూపల్లి చివరకు గన్‌పార్క్‌కు రాలేదని ఆయన ఆరోపించారు.

తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, చర్చకు సవాల్ చేసి మధ్యలో వెనక్కి తగ్గడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వం నిజంగా చర్చకు సిద్ధంగా ఉంటే బహిరంగ వేదికపై ప్రజల సమక్షంలో అన్ని అంశాలపై చర్చించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వ పనితీరు, ప్రస్తుత ప్రభుత్వ పాలనపై వాస్తవాలను ప్రజల ముందుంచుతామని అన్నారు.

అలాగే సంక్షేమ శాఖలో రూ.2,000 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై ఆధారాలతో సహా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. హరీశ్‌రావు, ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌లను పోలీసులు అడ్డుకోవడం, అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

రాష్ట్ర అప్పులు, ప్రభుత్వ హామీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ సవాళ్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!