– వినాయక రైస్ మిల్ పై.. రైతులు ప్రశంసలు
అక్బరుపేట భూంపల్లి మే 04 (ఆశ్వి అప్డేట్స్) : వేగంగా ఐకేపీ వడ్లను అన్లోడింగ్ చేస్తూ..రైతులకు అండగా ఖాజీపూర్ వినాయక రైస్ మిల్ నిలుస్తుందని రైతు అన్నలు ప్రశంసలు కురిపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్బరుపేట భూంపల్లి మండలంలోని ఖాజీపూర్ గ్రామంలోని ఉన్న వినాయక రైస్ మిల్ ఇప్పుడు రైతుల అందరికి అండగా నిలుస్తుంది..వివిధ గ్రామాలు మండలాల నుండి వచ్చిన ధాన్యాన్ని సేకరించడంలో ముందజలో దూసుకుపోతుంది..ఈ మిల్ లో రైతు బిడ్డలే మిల్ నిర్వాహకులు కావడంతో రైతుల కష్టాలను గమనించి..త్వత్వరిగా ధాన్యం సేకరిస్తున్నారనీ రైతులు పేర్కొన్నారు…దీంతో రైతులు రైస్ మిల్ యాజమాన్యం పై ప్రశంసలు గుప్పిస్తున్నారు…
*రైతులకు,వాహనాల డ్రైవర్లకు ప్రత్యేక్య కృతజ్ఞతలు*
సీరియల్ వారిగా రెండు మూడు రోజులు అయినా రైతుల కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉండి రైతుల ధాన్యాన్ని వాహనంలో మిల్ కి తరలిస్తున్నటువంటి వాహనాలు డ్రైవర్ల ఓపిక కి వినాయక రైస్ మిల్ అభినందనలు తెలుపుతున్నారు.రైతులకు ఎల్లప్పుడూ అండగా వినాయక రైస్ మిల్ తోడుగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు..
