ePaper
Tuesday, June 30, 2026
ePaper
Homeసినీమాజన నాయకన్' నిర్మాతకు ఢిల్లీలో కీలక ప్రభుత్వ పదవి

జన నాయకన్’ నిర్మాతకు ఢిల్లీలో కీలక ప్రభుత్వ పదవి

‘జన నాయకన్’ నిర్మాతకు కీలక ప్రభుత్వ పదవి.. ఇండస్ట్రీలో హాట్ టాపిక్

చెన్నై: దళపతి విజయ్ చివరి చిత్రంగా ప్రచారం పొందుతున్న ‘జన నాయకన్’ సినిమా విడుదలకు ముందే నిర్మాత కేవీఎన్ వెంకట్ నారాయణ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. తమిళనాడు ప్రభుత్వం ఆయనను న్యూఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కేవీఎన్ వెంకట్ నారాయణ ఒక సంవత్సరం పాటు ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆయన బాధ్యతలు, వేతన భత్యాలు, ఇతర పరిపాలనా అంశాలను ప్రభుత్వం ప్రత్యేకంగా వెల్లడించనుంది.

బెంగళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన కేవీఎన్ వెంకట్ నారాయణ, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దక్షిణాది భాషల్లో భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విజయ్ హీరోగా రూపొందుతున్న ‘జన నాయకన్’ చిత్రానికి ఆయన నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ఈ కీలక ప్రభుత్వ నియామకంతో ‘జన నాయకన్’ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది. వ్యాపార, పరిపాలనా అనుభవాన్ని గుర్తించే చర్యగా కొందరు ఈ నియామకాన్ని అభివర్ణిస్తుండగా, రాజకీయ వర్గాల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!