‘మా ఇంటి బంగారం 2’కి గ్రీన్ సిగ్నల్.. సక్సెస్ మీట్లో సర్ప్రైజ్ అనౌన్స్మెంట్
హైదరాబాద్: స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో చిత్రబృందం అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న కథా రచయిత, నిర్మాత రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం 2’ తెరకెక్కనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
రాజ్ నిడిమోరు మాట్లాడుతూ, ఈ సినిమా విజయం తనకు ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘స్త్రీ’ వంటి భారీ విజయాల కంటే కూడా ప్రత్యేకమని అన్నారు. ప్రేక్షకులు చూపిన ఆదరణతోనే సీక్వెల్ రూపొందించే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రెండో భాగంలో కథను మరింత ఆసక్తికరంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సమంత నటనకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్, వినోదం కలగలిసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శితమవుతుండగా, ఇప్పుడు సీక్వెల్ ప్రకటనతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
