ePaper
Monday, August 31, 2026
ePaper
Homeసినీమాపారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. చారిత్రక సినీ సంస్థలో శాశ్వత సీటు

పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. చారిత్రక సినీ సంస్థలో శాశ్వత సీటు

పారిస్‌లో రాజమౌళికి అరుదైన గౌరవం.. చారిత్రక సినీ సంస్థలో శాశ్వత సీటు

హైదరాబాద్: భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళికి ఫ్రాన్స్‌లో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న ఆయనను ప్రముఖ సినీ సంస్థ సినెమాథెక్ ఫ్రాన్సైస్ ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా పారిస్‌లోని చారిత్రక హెన్రీ లాంగ్లోయిస్ హాల్‌లో రాజమౌళి పేరుతో శాశ్వత సీటును ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది.

ప్రపంచ సినీ చరిత్రలో విశిష్ట స్థానం కలిగిన ఈ సంస్థలో ఇలాంటి గుర్తింపు దక్కడం అత్యంత అరుదైన గౌరవంగా భావిస్తారు. ఫ్రెంచ్ దిగ్గజ దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత కోస్టా గావ్రాస్ సమక్షంలో రాజమౌళికి ఈ సత్కారం అందజేశారు. అలాగే ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలను ప్రత్యేకంగా ప్రదర్శించి నివాళులర్పించారు.

ఈ గౌరవంపై స్పందించిన రాజమౌళి, పారిస్‌లో తన సినిమాలు ప్రదర్శించడమే గొప్ప అనుభూతి అనుకుంటే, తన పేరుతో శాశ్వత సీటు ఏర్పాటు చేయడం జీవితంలో మరపురాని ఘట్టమని తెలిపారు. భారతీయ సినిమాకు ఈ గౌరవం దక్కడం ఆనందంగా ఉందని, తనపై ప్రేమాభిమానాలు చూపిన సినెమాథెక్ ఫ్రాన్సైస్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళికి లభించిన ఈ గౌరవం తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!